Thursday, March 19, 2026
News Channel Default Image

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు | బెంగాల్ గ్రౌండ్ జీరోలో, దుఃఖం మరియు భయం విభజనను ఛేదించాయి: ‘ఎవరు న్యాయం చేస్తారు?’

ముర్షిదాబాద్ వక్ఫ్ బిల్లు నిరసన: ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర సాయుధ దళాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం, ఇప్పటివరకు 150 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముషిదాబాద్లో జరుగుతున్న వక్ఫ్ బిల్లు నిరసన కార్యక్రమం మరణ హోమానికి దారితీస్తుంది. అక్కడ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వక్ఫ్ బిల్లును ఈ రాష్ట్రంలో అమలు చేసేది లేదని సాక్షాత్తు సీఎం మమతా బెనర్జీ చెప్పడం దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లింది. ముస్లింల సంతిష్ఠికరణ కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మతోన్మాదులు మరింత రెచ్చిపోయేలా, చెలరేగేలా తన ప్రసంగాలను చేస్తుంది. ముర్షిదాబాదులో పరిస్థితి చూస్తుంటే రాబోయే కాలంలో ఆ రాష్ట్రాన్ని మరో బాంగ్లాదేశ్ గా చేసి బంగ్లాదేశ్ లో కలిపినా గాని ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదన్నట్టు ఆమె మాటల్లో కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో హిందువులను ఊర్లో నుంచి ముస్లింలు భయభ్రాంతులకు గురిచేస్తూ తరిమి వేస్తున్నట్లు సమాచారం.. అక్కడ సీఎం అవుతా బెనర్జీ అండదండలతో బంగ్లా మైన్మార్ దేశాల నుంచి వచ్చిన ముస్లింలు, రోహింగ్యాలు బెంగాల్ హిందువులపై దాడులు చేస్తూ మారణ హోమానికి పాల్పడుతున్నారు..
ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువులంతా ఏకమై నిలబడితే మమతా బెనర్జీ ప్రభుత్వానికి ముప్పు తప్పదు. దేశంలో బిజెపి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు స్థానిక ప్రాంతీయ ప్రభుత్వాలు మత విద్వేషాలను ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపించేలా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దేశంలో అల్లర్లు పెరిగిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *